BCCI: ఆసియా కప్ లో పాల్గొనడం లేదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

BCCI Clarifies Indias Participation in Asia Cup 2025
  • ఆ వార్తల్లో నిజం లేదన్న బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా
  • ప్రస్తుతం ఐపీఎల్, ఇంగ్లండ్ సిరీస్‌పైనే దృష్టి అని వెల్లడి
  • ఏసీసీ ఈవెంట్లపై ఇప్పటి వరకు చర్చలు జరపలేదనన్న దేవజిత్
ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టు పాల్గొనబోవడం లేదంటూ వస్తున్న వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టతనిచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తేల్చిచెప్పారు. టీమిండియా ఆసియా కప్ లేదా మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలగినట్లు వచ్చిన కథనాలను ఆయన కొట్టిపారేశారు.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్ల గురించి బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదని, ఎటువంటి నిర్ణయాలూ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. "ప్రస్తుతం బీసీసీఐ మొత్తం దృష్టి ఐపీఎల్ 2025 సీజన్, ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌పైన మాత్రమే ఉంది. ఆసియా కప్ విషయంపై బోర్డులో ఎలాంటి చర్చ జరగలేదు" అని సైకియా వివరించారు.

ఏసీసీ టోర్నమెంట్ల గురించి భవిష్యత్తులో చర్చలు జరిపినప్పుడు, సరైన సమయంలో అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలను, కల్పిత వార్తలను నమ్మవద్దని క్రికెట్ అభిమానులకు ఆయన సూచించారు.
BCCI
Asia Cup 2025
Indian Cricket Team
ACC
Jay Shah
Cricket News
Devajit Saikia
IPL 2025
England Series
Asia Cricket Council

More Telugu News