Telangana Government: తెలంగాణలో మందుబాబులకు షాక్... పెరిగిన మద్యం ధరలు

Liquor Price Hike in Telangana
  • ఇప్పటికే బీర్ల ధరలను భారీగా పెంచిన టీజీ ప్రభుత్వం
  • తాజాగా క్వార్టర్ మద్యంపై రూ. 10 పెంచుతూ ఉత్తర్వులు జారీ
  • రాష్ట్రానికి ప్రతి నెల అదనంగా రూ. 160 కోట్ల మేర ఆదాయం
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే బీర్ల రేట్లను భారీగా పెంచిన ప్రభుత్వం... ఇప్పుడు మద్యం ధరలను పెంచింది. క్వార్టర్ కు రూ. 10, హాఫ్ కు రూ. 20, ఫుల్ బాటిల్ కు రూ. 40 పెంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి నెల అదనంగా రూ. 160 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. అయితే, చీప్ లిక్కర్ ధరను మాత్రం ప్రభుత్వం పెంచకపోవడం గమనార్హం.
Telangana Government
Liquor Price Hike
Alcohol Prices Increased
Telangana Excise Department
Telangana Liquor Policy
Alcohol Taxes
Cheap Liquor
Telangana Revenue
Increased Excise Duty

More Telugu News