Yuzvendra Chahal: ఆయన చాలా కేరింగ్ పర్సన్.. చాహల్ కు మహ్ వశ్ కితాబు

Mahvash Praises Yuzvendra Chahal
--
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, రేడియో జాకీ మహ్ వశ్ ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను ఈ జంట కలిసి వీక్షించింది. అంతకుముందు కూడా పలు వేదికలపై చాహల్, మహ్ వశ్ జంటగా కనిపించారు. ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న తర్వాత చాహల్ రేడియో జాకీ మహ్ వశ్ ప్రేమలో పడ్డారని, ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, తమ బంధంపై చాహల్ కానీ, మహ్ వశ్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అదే సమయంలో తమపై వస్తున్న రూమర్లను తోసిపుచ్చలేదు.

ఈనేపథ్యంలోనే మహ్ వశ్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాహల్ పై ప్రశంసల జల్లు కురిపించింది. చాహల్ చాలా కేరింగ్ పర్సన్ అని, ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రేమించిన వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చారు. చాహల్‌ చాలా మంచివాడు, వినయపూర్వకంగా ఉంటాడని మహ్ వశ్ వివరించారు. చాహల్ లో ఉన్న ఈ ప్రత్యేక లక్షణాలను అందిపుచ్చుకోవాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. మహ్ వశ్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలతో చాహల్ తో ఆమె బంధంపై మరోసారి చర్చ జరుగుతోంది.

Yuzvendra Chahal
Mahvash
Chahal Mahvash relationship
Indian cricketer
Radio Jockey
Dating rumors
Celebrity couple
Cricket news
Bollywood news
Indian celebrity news

More Telugu News