Suriya-Venky Atluri: వెంకీ అట్లూరి-సూర్య కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం

Suriya and Venky Atluris New Film Launched
  • హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంచింగ్ కార్య‌క్రమం
  • హాజ‌రైన చిత్రబృందం 
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాణం
  • త్వ‌రలోనే షూటింగ్‌కు వెళ్ల‌నున్న సినిమా
టాలీవుడ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేష‌న్‌లో ఓ మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా సోమ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన‌ ఈ లాంచింగ్ కార్య‌క్ర‌మానికి చిత్రబృందం హాజ‌రైంది. 

ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇత‌ర నటీనటులు, మిగ‌తా యూనిట్‌ వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో క‌లిసి ప్ర‌ముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. 

ఇక‌, సూర్య తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రెట్రో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ చిత్రం అంచనాలను అందుకోకపోవడంతో ఇప్పుడు సూర్య త‌న ఆశ‌ల‌న్నీ వెంకీపైనే పెట్టుకున్నారు. ఎందుకంటే వెంకీ అట్లూరి ఇటీవ‌ల ల‌క్కీ భాస్క‌ర్‌, సార్ వంటి వ‌రుస హిట్స్ ఇచ్చారు. దాంతో ఈసారి త‌న‌కు కూడా హిట్ ఇస్తాడ‌ని కోలీవుడ్ స్టార్ న‌మ్మ‌కంగా ఉన్నాడు. 
Suriya-Venky Atluri
new movie
Telugu cinema
Kollywood star
Tollywood director
Sithara Entertainments
Fortune Four Cinemas
Suriyanarayana Nagavamshi
movie launch

More Telugu News