Punjab Kings: ఐపీఎల్: రాజస్థాన్ రాయల్స్ పై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
- మళ్లీ మొదలైన ఐపీఎల్
- నేడు రెండు మ్యాచ్ లు
- తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ × రాజస్థాన్ రాయల్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
ఇటీవల భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ టోర్నీ ఎట్టకేలకు మళ్లీ మొదలైంది. నిన్న బెంగళూరులో ఆర్సీబీ, కేకేఆర్ మధ్య మ్యాచ్ వర్షార్పణం అయినప్పటికీ, టోర్నీ అయితే రీస్టార్ట్ అయింది. ఇవాళ ఆదివారం కావడంతో డబుల్ హెడర్ (రెండు మ్యాచ్ లు) నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలయ్యే తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
పంజాబ్ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంటుంది. ఆ జట్టు 11 మ్యాచ్ ల్లో 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు ఆడిన 12 మ్యాచ్ ల్లో 9 మ్యాచ్ లు ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించింది.