Vijayawada Couple: విజయవాడలో బైక్ పై ప్రేమ జంట రొమాన్స్.. వీడియో వైరల్

Vijayawada Couples Bike Romance Video Goes Viral
  • మండిపడుతున్న వాహనదారులు
  • మద్యం మత్తులు అసభ్య చేష్టలు
  • ప్రమాదకరంగా బైక్ పై ప్రయాణిస్తూ రొమాన్స్
విజయవాడలో ఓ ప్రేమజంట బైక్ పై ప్రయాణిస్తూ రొమాన్స్ చేసింది. హైవేపై ప్రయాణిస్తూ ప్రమాదకరంగా ప్రవర్తించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రేమజంట తీరుపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. విజయవాడలోని రామలింగేశ్వర నగర్ ఫ్లై ఓవర్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడు బైక్ నడుపుతుంటే ప్రియురాలు అతడి ముందు పెట్రోల్ ట్యాంక్పై ఎదురుగా కూర్చుంది. చుట్టూ వాహనాలు వెళుతున్నా పట్టించుకోకుండా వారు రొమాన్స్ లో మునిగిపోవడం వీడియోలో కనిపిస్తోంది.

మద్యం మత్తులో వీరు చేస్తున్న విపరీత చేష్టలను మరో బైకర్ తన సెల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆ జంటపై మండిపడుతున్నారు. బైక్ పై ప్రయాణిస్తూ రొమాన్స్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చేష్టల వల్ల వారితో పాటు మిగతా వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఈ జంటపై చర్యలు తీసుకోవాలని, మరోసారి ఎవరూ ఇలా చేయకుండా బుద్ధి చెప్పాలని పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.
Vijayawada Couple
Viral Video
Bike Romance
Dangerous Stunt
Highway Romance
Social Media Viral
Traffic Violation
Reckless Driving
Andhra Pradesh
Indian Couple

More Telugu News