Mahabubnagar: ఫొటోగ్రఫీ పేరుతో నీలిచిత్రాల చిత్రీక‌ర‌ణ‌.. కెమెరామన్‌ లీలలు

Photographer Arrested for Running Sex Racket in Mahabubnagar
  • మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ ఘ‌ట‌న
  • యువతులను వేధించి నీలిచిత్రాల‌ చిత్రీకరణ
  • పోలీసుల అదుపులో నిందితుడు
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. ఫొటోగ్రఫీ పేరుతో సెక్స్ రాకెట్‌ నిర్వహిస్తున్న కెమెరామన్‌ లీలలు వెలుగులోకి వచ్చాయి. కెమెరామన్ అమాయ‌క యువ‌తుల‌ను టార్గెట్‌ చేసి ఫొటోషూట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోల పేరుతో నీలిచిత్రాలు చిత్రీక‌రించాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎండీ ఎజాస్‌ అనే యువకుడు ఆరేళ్ల‌ క్రితం జీవ‌నోపాధి కోసం మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడకు వచ్చాడు. ఫిజా పేరుతో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఈ క్ర‌మంలో కోయిలకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. 

అయితే, స్టూడియోకు వచ్చే అమాయక యువతులను టార్గెట్‌ చేసిన ఎజాస్‌ ఫొటోషూట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోల పేరుతో ఎరవేసి సీక్రెట్‌గా నీలిచిత్రాలు తీసేవాడు. ఆ త‌ర్వాత ఈ చిత్రాలతో సదరు యువతులను పలుమార్లు లైంగికంగా వేధించి, 20 మంది యువకులతో నీలిచిత్రాలు తీసినట్టు స‌మాచారం. 

గురువారం ఓ యువతికి సంబంధించిన అశ్లీల వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో సదరు యువతి బంధువులు, స్థానిక యువకులు ఎజాస్‌పై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌టనాస్థ‌లికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫొటో స్టూడియోలో ఉన్న కంప్యూటర్‌, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. 
Mahabubnagar
MD Ajaz
Sex racket
photography studio
cyber crime
illegal videos
social media
police investigation
Andhra Pradesh
Hanwada

More Telugu News