Indian MPs: అమెరికాకు శశి థరూర్.. సౌదీకి ఒవైసీ.. ఎంపీల బృందాలు వెళ్లే దేశాలివే..

Indian MPs Delegation to Visit Multiple Countries
  • ఉగ్రవాదంపై భారత్‌ యొక్క జీరో-టాలరెన్స్ వైఖరిని, ఆపరేషన్ సిందూర్‌పై విదేశాలలో ప్రచారం
  • ఏడు అఖిలపక్ష ప్రతినిధుల జాబితాను ప్ర‌క‌టించిన‌ కేంద్రం
  • 59 మంది సభ్యులతో కూడిన ఈ బృందాలు మే 23 నుంచి 32 దేశాల సందర్శన‌
ఏప్రిల్ 22న‌ జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన పాశ‌విక‌ ఉగ్రవాద దాడి తర్వాత ఉగ్రవాదంపై భారత్‌ యొక్క జీరో-టాలరెన్స్ వైఖరిని, ఆపరేషన్ సిందూర్‌పై విదేశాలలో ప్రచారం చేయడానికి వివిధ దేశాలకు ప్రయాణించే ఏడు అఖిలపక్ష ప్రతినిధుల జాబితాను కేంద్రం శనివారం విడుదల చేసింది. 59 మంది సభ్యులతో కూడిన ఈ బృందాలు మే 23 నుంచి 32 దేశాలను సందర్శిస్తాయి.

వీరిలో ఎన్‌డీఏ (NDA) నుంచి 31 మంది రాజకీయ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన 20 మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వారికి మాజీ దౌత్యవేత్తలు సహాయం చేయ‌నున్నారు.

ఈ ప్రతినిధుల బృందాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీలు బైజయంత్ జయ్ పాండా, రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్‌కు చెందిన శశి థరూర్ , జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నాయకుడు సంజయ్ ఝా, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ ఎంపీ కనిమొళి కరుణానిధి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) నాయకురాలు సుప్రియా సూలే నేతృత్వం వహిస్తారు. వారు 32 దేశాలను, బెల్జియంలోని బ్రస్సెల్స్‌లోని ఈయూ (EU) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. 

ఏడు ఎంపీల బృందాలు.. వారు వెళ్లే దేశాలివే...

గ్రూప్ 1: సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియాలను సందర్శిస్తుంది. 
బైజయంత్ పాండా, బీజేపీ ఎంపీ
నిషికాంత్ దూబే , బీజేపీ ఎంపీ
ఫాంగ్నోన్ కొన్యాక్, బీజేపీ ఎంపీ
రేఖా శర్మ, బీజేపీ ఎంపీ
అసదుద్దీన్ ఒవైసీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎంపీ
సత్నామ్ సింగ్ సంధు, నామినేటెడ్ ఎంపీ
గులాం నబీ ఆజాద్, మాజీ కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి
రాయబారి హర్ష్ ష్రింగ్లా

గ్రూప్ 2: యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్‌లకు వెళుతుంది.
రవిశంకర్ ప్రసాద్, బీజేపీ ఎంపీ
దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ ఎంపీ
ప్రియాంక చతుర్వేది, శివసేన (యూబీటీ)
గులాం అలీ ఖతానా, నామినేటెడ్ ఎంపీ
అమర్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ
సమిక్ భట్టాచార్య, బీజేపీ ఎంపీ
ఎంజే అక్బర్, మాజీ కేంద్ర మంత్రి
రాయబారి పంకజ్ సరన్

గ్రూప్ 3: ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌లను సందర్శిస్తుంది.
సంజయ్ కుమార్ ఝా, జేడీయూ ఎంపీ
అపరాజిత సారంగి, బీజేపీ ఎంపీ
యూసుఫ్ పఠాన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
బ్రిజ్ లాల్, బీజేపీ ఎంపీ
జాన్ బ్రిట్టాస్, సీపీఐ (ఎం) ఎంపీ
ప్రదాన్ బారుహ్, బీజేపీ ఎంపీ
హేమంగ్ జోషి, బీజేపీ ఎంపీ
సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్
అంబాసిడర్ మోహన్ కుమార్

గ్రూప్ 4: యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్‌లను సందర్శిస్తుంది.
శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, శివసేన ఎంపీ
బన్సూరి స్వరాజ్, బీజేపీ ఎంపీ
మహ్మద్ బషీర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఎంపీ
అతుల్ గార్గ్, బీజేపీ ఎంపీ
సస్మిత్ పాత్ర, బిజూ జనతా దళ్ (బీజేడీ) ఎంపీ
మనన్ కుమార్ మిశ్రా, బీజేపీ ఎంపీ
ఎస్ఎస్ అహ్లువాలియా, బీజేపీ మాజీ ఎంపీ
అంబాసిడర్ సుజన్ చినాయ్

గ్రూప్ 5: అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియాలో పర్యటిస్తుంది.
శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ
శాంభవి, ఎల్జేపీ (రామ్ విలాస్) ఎంపీ
సర్ఫరాజ్ అహ్మద్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎంపీ
జీఎం హరీశ్ బాలయోగి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ
శశాంక్ మణి త్రిపాఠి, బీజేపీ ఎంపీ
భువనేశ్వర్ సింగ్ కలిత, బీజేపీ ఎంపీ
మిలింద్ మురళీ దేవరా, శివసేన ఎంపీ
తేజస్వి సూర్య, బీజేపీ ఎంపీ
రాయబారి తరంజిత్ సింగ్ సంధు

గ్రూప్ 6: స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాలను సందర్శిస్తుంది.
కనిమొళి కరుణానిధి, డీఎంకే ఎంపీ
రాజీవ్ రాయ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ
మియాన్ అల్తాఫ్ అహ్మద్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ
బ్రిజేష్ చౌతా, బీజేపీ ఎంపీ
ప్రేమ్ చంద్ గుప్తా, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎంపీ
అశోక్ కుమార్ మిట్టల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ
అంబాసిడర్ మంజీవ్ ఎస్ పూరీ
రాయబారి జావేద్ అష్రఫ్

గ్రూప్ 7: ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికాలను సందర్శిస్తుంది.
సుప్రియా సూలే, ఎన్‌సీపీ (ఎస్‌సీపీ) ఎంపీ
రాజీవ్ ప్రతాప్ రూడీ, బీజేపీ ఎంపీ
విక్రమజీత్ సింగ్ సాహ్నీ, ఆప్ ఎంపీ
మనీశ్‌ తివారీ, కాంగ్రెస్ ఎంపీ
అనురాగ్ సింగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ
లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ ఎంపీ
ఆనంద్ శర్మ, కాంగ్రెస్
వి మురళీధరన్, బీజేపీ
రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్
Indian MPs
Shashi Tharoor
Asaduddin Owaisi
International Trip
Parliamentarians
Anti-Terrorism
Operation Sindhoor
India's Foreign Policy
BJP
Congress

More Telugu News