Chandrababu Naidu: రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపాం: సీఎం చంద్రబాబు

Rs 495 Lakh Crore Investments Approved in Andhra Pradesh
  • ఏపీలో పారిశ్రామిక ప్రగతికి కొత్త ఊపు
  • రూ.33 వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్
  • పరిశ్రమల ఆకర్షణే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) 6వ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు రూ. 33 వేల కోట్లకు పైగా విలువైన 19 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడులు ప్రధానంగా ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రానున్నాయి. వీటి ద్వారా సుమారు 35 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా.

గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంపై విశ్వాసం కోల్పోయిన పారిశ్రామికవేత్తలను తిరిగి ఆకర్షించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. గడచిన 11 నెలల కాలంలో ఎస్ఐపీబీ ఆరుసార్లు సమావేశమై, మొత్తం 76 ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.4,95,796 కోట్ల పెట్టుబడులు రానుండగా, 4,50,934 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు శంకుస్థాపనలు కూడా పూర్తిచేశాయి.

6వ ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన పెట్టుబడుల వివరాలు :

6వ ఎస్ఐపీబీ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 19 సంస్థలకు సంబంధించి రూ. 33,720 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 34,621 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. 

ఐ అండ్ సి డిపార్ట్‌మెంట్:
1) డెక్కన్ ఫైన్ కెమికల్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ : కుమరవరం, అనకాపల్లి జిల్లా - రూ.1,560 కోట్ల పెట్టుబడులు, 1,800 ఉద్యోగాలు
2) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ : పాలసముద్రం, శ్రీ సత్యసాయి జిల్లా - రూ.1,400 కోట్ల పెట్టుబడులు, 800 ఉద్యోగాలు
3) పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ : ఓర్వకల్, కర్నూలు జిల్లా - రూ.1,286 కోట్ల పెట్టుబడులు, 1,200 ఉద్యోగాలు
4) బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ : రాంబిల్లి, అనకాపల్లి జిల్లా - రూ.2,300 కోట్ల పెట్టుబడులు, 1,750 ఉద్యోగాలు
5) జుపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ : రాంబిల్లి, అనకాపల్లి జిల్లా - రూ.2,700 కోట్ల పెట్టుబడులు, 2,216 ఉద్యోగాలు

టెక్స్‌టైల్ డిపార్ట్‌మెంట్:
6) రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ : తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా - రూ.228 కోట్ల పెట్టుబడులు, 250 ఉద్యోగాలు
7) మోహన్ స్పింటెక్స్ : మాలవల్లి, కృష్ణా జిల్లా - రూ.482 కోట్ల పెట్టుబడులు, 1,525 ఉద్యోగాలు
8) ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ : అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా - రూ.1,779 కోట్ల పెట్టుబడులు, 600 ఉద్యోగాలు

ఏపీఐఐసీ డిపార్ట్‌మెంట్:
9) వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ : తిరుపతి జిల్లా - రూ.1,061 కోట్ల పెట్టుబడులు, 10,098 ఉద్యోగాలు
10) అలీప్ కుప్పం : చిత్తూరు జిల్లా - రూ.5 కోట్ల పెట్టుబడులు, 1,500 ఉద్యోగాలు

ఎనర్జీ డిపార్ట్‌మెంట్: 
11) నితిన్ సాయి కనస్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ : ఏలూరు జిల్లా - రూ.150 కోట్ల పెట్టుబడులు, 500 ఉద్యోగాలు
12) దేశ్‌రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు - రూ.2,920 కోట్ల పెట్టుబడులు, 230 ఉద్యోగాలు
13) ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ : కడప జిల్లా - రూ.3,941 కోట్ల పెట్టుబడులు, 260 ఉద్యోగాలు
14) బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు - రూ.9,000 కోట్ల పెట్టుబడులు, 3,900 ఉద్యోగాలు

టూరిజం డిపార్ట్‌మెంట్: 
15) బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్‌ పి: తిరుపతి - రూ.150 కోట్ల పెట్టుబడులు, 350 ఉద్యోగాలు
16) స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ : తిరుపతి - రూ.327 కోట్ల పెట్టుబడులు, 570 ఉద్యోగాలు
17) వరుణ్ హాస్పటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ : విశాఖపట్నం - రూ.899 కోట్ల పెట్టుబడులు, 1,300 ఉద్యోగాలు

ఐటీ డిపార్ట్‌మెంట్: 
18) డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : శ్రీసిటీ, తిరుపతి జిల్లా - రూ.2,475 కోట్ల పెట్టుబడులు, 5,150 ఉద్యోగాలు
19) సెన్సోరెమ్ ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : కర్నూలు జిల్లా - రూ.1,057 కోట్ల పెట్టుబడులు, 622 ఉద్యోగాలు
Chandrababu Naidu
Andhra Pradesh
AP Investments
Industrial Projects
SIPB
Energy Sector
Tourism Sector
IT Sector
Electronics Sector
Employment Opportunities

More Telugu News