Jayaprakash Reddy: సినిమాలు చేయనని నాన్న మధ్యలోనే తిరిగొచ్చారు: జయప్రకాశ్ రెడ్డి కూతురు మల్లిక

Mallika Interview
  • నాన్నకి నాటకాలు అంటే ప్రాణం 
  • 1985లోనే ఆయన సినిమాల్లోకి వెళ్లారు 
  • సరైన బ్రేక్ లేకపోవడం వలన వెనక్కి వచ్చేశారు 
  • 'ప్రేమించుకుందాం రా'తో రీ ఎంట్రీ 
  • ఆ సినిమాతో కెరియర్ ఊపందుకుందన్న జయప్రకాశ్ రెడ్డి కూతురు

జయప్రకాశ్ రెడ్డి పేరు వినగానే ఆయన రాయలసీమ మాండలికం.. హీరోయిజాన్ని లెక్కచేయని విలనిజం గుర్తొస్తాయి. అప్పట్లో రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. అలాంటి జయప్రకాశ్ రెడ్డి కొంతకాలం క్రితం చనిపోయారు. ఆయనకి సంబంధించిన అనేక విషయాలను ఆయన కూతురు మల్లిక, సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

"నాన్నగారికి 22 ఏళ్ల వయసులోనే వివాహమైంది. 8 ఏళ్లు గడిచినా సంతానం లేకపోవడం వలన, తాతగారు వాళ్లే రెండో వివాహం చేశారు. అప్పుడు ఆయనకి కలిగిన మొదటి సంతానం నేను. నాన్నగారికి మొదటి నుంచి నాటకాలు అంటే ప్రాణం. అదే ఆయనను సినిమాల దిశగా నడిపించింది. 1985లోనే ఆయన సినిమాలలో చేశారు. అయితే సరైన పాత్ర పడకపోవడం వలన, ఆయనకి గుర్తింపు రాలేదు" అని అన్నారు. 

ఇక మనకి సినిమాలు సరిపడవని అనుకుని, 1992లో ఇండస్ట్రీ నుంచి గుంటూరు వచ్చేసి పిల్లలకి ట్యూషన్స్ చెప్పుకునేవారు. ఆ తరువాత ఆయనకి 'ప్రేమించుకుందాం రా' సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆయన రాయలసీమ మాండలికం వాడటం ఈ సినిమా నుంచే మొదలైంది. ఈ సినిమా తరువాత ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్లు ఆయనను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. చనిపోయేంత వరకూ ఆయన నటిస్తూనే వచ్చారు" అని చెప్పారు. 

Jayaprakash Reddy
Telugu Actor
Rayalaseema dialect
Tollywood
Telugu Cinema
Mallika (Jayaprakash Reddy's daughter)
Suman TV interview
Preminchukundam Ra
Telugu film industry
Factionism in Rayalaseema

More Telugu News