India: టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్

India Blocks Turkey China Media Accounts
  • ఆపరేషన్ సిందూర్ పై అసత్య ప్రచారం
  • తీవ్రంగా స్పందించిన భారత్
  • టీఆర్టీ వరల్డ్, గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాలకు చెక్
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందన్న ఆరోపణలపై టర్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసార సంస్థ 'టీఆర్టీ వరల్డ్' ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం బుధవారం నిలిపివేసింది. పాకిస్థాన్ ఉపయోగించిన టర్కీ నిర్మిత డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడినట్లు ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడైన కొద్ది రోజులకే ఈ చర్య తీసుకోవడం గమనార్హం.

పాకిస్థాన్ చేసిన చొరబాటు యత్నాన్ని భారత రక్షణ దళాలు తక్షణమే తిప్పికొట్టాయి, భారత భూభాగానికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకున్నాయి. అదే సమయంలో, చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థలైన గ్లోబల్ టైమ్స్, జిన్హువాలకు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. 

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యం గురించి ధృవీకరించని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఈ సంస్థలు వ్యాప్తి చేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ ఖాతాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే, "ఖాతా నిలిపివేయబడింది. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా @trtworld భారతదేశంలో నిలిపివేయబడింది" అనే సందేశం కనిపిస్తోంది.

'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ కచ్చితమైన వైమానిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం టీఆర్టీ వరల్డ్ తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను ప్రచారం చేసినట్లు గుర్తించారు.
India
Turkey
China
Media Block
Social Media Accounts
TRT World
Global Times
Xinhua
Operation Sundar
Pakistan

More Telugu News