Ravindra Jadeja: రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా

Ravindra Jadeja Creates Record in ICC Test Rankings
  • ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండ‌ర్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని ప‌దిలం చేసుకున్న జ‌డ్డూ 
  • సుదీర్ఘ కాలం పాటు అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న ఆట‌గాడిగా రికార్డు
  • 1,151 రోజులుగా ఈ స్థానంలో కొన‌సాగుతున్న జ‌డేజా
భార‌త జ‌ట్టు స్టార్ క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘ‌నత సాధించాడు. తాజాగా ఐసీసీ విడుద‌ల చేసిన టెస్ట్ ఆల్‌రౌండ‌ర్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. అదే స‌మ‌యంలో సుదీర్ఘ కాలం పాటు అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న ఆట‌గాడిగా రికార్డుకెక్కాడు. 1,151 రోజులుగా జ‌డ్డూ ఈ స్థానంలో కొన‌సాగుతున్నాడు.

ఇక‌, తాజా ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో ర‌వీంద్ర‌ జడేజా (400 పాయింట్లు) త‌ర్వాత రెండో స్థానంలో బంగ్లాదేశ్‌కు చెందిన‌ మెహదీ హసన్ మీరాజ్ (327 పాయింట్లు) ఉంటే... ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు మార్కో యన్సెన్ (294 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమ్మిన్స్, బంగ్లాకు చెందిన షకీబ్ అల్ హసన్ టాప్-5 జాబితాలో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టాప్ 10లో ఉన్న ఏకైక భారత ఆల్ రౌండర్ జడేజానే.

ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న ప్లేయ‌ర్లు వీరే
రవీంద్ర జడేజా (భారతదేశం) - 400 పాయింట్లు
మెహదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్) - 327 పాయింట్లు
మార్కో యన్సెన్ (దక్షిణాఫ్రికా) - 294 పాయింట్లు
పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా) - 271 పాయింట్లు
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 253 పాయింట్లు
జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) - 249 పాయింట్లు
జో రూట్ (ఇంగ్లాండ్) - 247 పాయింట్లు
గస్ అట్కిన్సన్ (ఇంగ్లాండ్) - 240 పాయింట్లు
బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) - 235 పాయింట్లు
క్రిస్ వోక్స్ (ఇంగ్లాండ్) - 225 పాయింట్లు
Ravindra Jadeja
ICC Test Rankings
Test All-Rounder
Cricket
India Cricket
Top Rank
Record
Mehdi Hasan Miraz
Marco Jansen
Pat Cummins

More Telugu News