Donald Trump: మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌

Trump Praises Saudi Prince Asks Unusual Sleep Question
  • ప్ర‌స్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న అమెరికా అధ్య‌క్షుడు
  • మంగళవారం రియాద్‌ చేరుకున్న ట్రంప్‌
  • సౌదీని ఎంతో గొప్పగా చేశారంటూ యువ‌రాజుపై ప్రశంస‌లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్ర‌స్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం రియాద్‌ చేరుకున్న ట్రంప్‌... ఈ న‌గ‌రాన్ని ప్రపంచ ప్రధాన వ్యాపార కేంద్రంగా మార్చినందుకు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను ప్రశంస‌ల‌తో ముంచెత్తారు. ఈ సంద‌ర్భంగా సౌదీ యువరాజుకు ట్రంప్ ఓ వింత‌ ప్రశ్న వేశారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ అవుతోంది.
 
"మహమ్మద్‌.. మీరు రాత్రి పూట నిద్రపోతారా..? మీరు ఎలా నిద్రపోతారు? సౌదీని ఎంతో గొప్పగా చేశారు. మాలో ఒకరిలా ఉంటూనే.. ఇంతలా ఎలా అభివృద్ధి చేశారు. సౌదీ అరేబియా అభివృద్ధిపై విమర్శకులకు ఎన్నో అనుమానాలు ఉండేవి. వారి అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ అభివృద్ధి చేసి చూపించారు. సౌదీని శక్తిమంతమైన వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దారు. నాకు మీరంటే ఎంతో అభిమానం" అంటూ సౌదీ ప్రిన్స్‌పై ట్రంప్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

ఇక‌, ఇదే స‌మావేశంలో సిరియాపై ఉన్న ఆంక్ష‌ల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ట్రంప్‌ ప్ర‌క‌టించారు. తుర్కియే అధ్యక్షుడు త‌య్యిప్ ఎర్డోగాన్ అభ్య‌ర్థ‌న మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు.
Donald Trump
Saudi Arabia
Mohammed bin Salman
Saudi Crown Prince
Trump's visit to Saudi Arabia
US President
Viral Question
Syria Sanctions
Turkey
International Relations

More Telugu News