Narendra Modi: ఆదంపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో

PM Modi Visits Adampoor Air Base After Operation Sindoor
  • పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లిన ప్రధాని
  • ఆపరేషన్ సిందూర్ సక్సెస్ పై మోదీ అభినందన
  • ఎయిర్ ఫోర్స్ అధికారులు, సైనికులతో ముచ్చటించిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైమానిక దళ అధికారులు, సైనికులతో ముచ్చటించారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పై సాయుధ బలగాలను ప్రధాని అభినందించారు. ప్రధాని దాదాపు గంటసేపు ఎయిర్ బేస్ లో గడిపారు.

గత నెలలో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా, మే 7న భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 9, 10 తేదీలలో పాకిస్థాన్ దాడికి యత్నించిన భారత వైమానిక కేంద్రాలలో ఆదంపూర్ కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ పర్యటన ద్వారా సైనికుల ధైర్యసాహసాలను, నిబద్ధతను ప్రధాని కొనియాడారు. 'భారత్ మాతాకీ జై' అంటూ సైనికులతో కలిసి నినాదాలు చేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసిన ఉన్న ఫొటోలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
Narendra Modi
Adampoor Air Base
Operation Sindoor
Pakistan
India
Air Force
Punjab
Terrorism
Military

More Telugu News