India-Pakistan Conflict: భారత్ దెబ్బకు పాక్ కకావికలం... శాటిలైట్ ఫుటేజి విడుదల చేసిన చైనా సంస్థ!

Indias Strike on Pakistans Nur Khan Air Base China Releases Satellite Footage
  • భారత్ దాడిలో దెబ్బతిన్న పాకిస్థాన్ సైనిక స్థావరాలు
  • నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కు భారీ నష్టం
  • తాజా శాటిలైట్ చిత్రాలను విడుదల చేసిన చైనా
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ జరిపిన ప్రతిదాడిలో పాకిస్థాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈ మేరకు చైనా విడుదల చేసిన తాజా శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల్లో సంయమనం పాటించినప్పటికీ, పాక్ చర్యలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది.

క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్ దాడులకు పాల్పడటంతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడుల్లో పాక్‌లోని పలు సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు గణనీయమైన నష్టం వాటిల్లింది.

రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్థాన్‌కు అత్యంత ముఖ్యమైన వైమానిక స్థావరం. భారత్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకే పాక్‌లోని వైమానిక స్థావరంపై దాడి చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లోని రన్‌వే ధ్వంసమైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను చైనా తాజాగా విడుదల చేసింది. 
India-Pakistan Conflict
Nur Khan Air Base
Operation Sindh
Satellite Imagery
China
Pakistan Air Force
Military Strike
Cross Border Attack
India Military Power

More Telugu News