భారత్ పాక్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఐపీఎల్ వాయిదా!
––
గురువారం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ భద్రతాకారణాలరీత్యా అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతకుముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ‘‘పరిస్థితిని బట్టి టోర్నమెంట్ భవిష్యత్తుపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటాం. అన్నింటికన్నా ఆటగాళ్ల భద్రత ముఖ్యం’’ అని పేర్కొన్నారు.