Delhi on High Alert: హై అల‌ర్ట్‌లోనే ఢిల్లీ.. ప్ర‌భుత్వ ఉద్యోగుల సెల‌వులు ర‌ద్దు

Delhi on High Alert Government Employee Holidays Cancelled
  
ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత దాయాది పాకిస్థాన్ వ‌క్ర‌బుద్ధితో భార‌త్‌పై డ్రోన్‌, క్షిప‌ణి దాడుల‌కు పాల్ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిత‌క్త‌ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల సెల‌వులు ర‌ద్దు అయ్యాయి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ఎదుర్కొనేలా వైద్య‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగాల సంసిద్ధ‌త‌ను స‌మీక్షిస్తున్నారు. 

"పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. సున్నిత‌మైన ప్రాంతాల‌లో అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రిస్తున్నాం. రాత్రిపూట నిఘా ముమ్మ‌రం చేశాం" అని అధికారులు తెలిపారు. ఇక‌, ఈ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే దేశంలో 24 విమాన‌శ్ర‌యాలు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే దేశ రాజ‌ధానికి రాక‌పోక‌లు కొన‌సాగించే ప‌లు విమానాలను క్యాన్సిల్ చేశారు. ఇండియా గేట్ వ‌ద్ద ట్రాఫిక్‌ను నియంత్రించ‌డంతో పాటు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల‌ని స్థానికుల‌ను అధికారులు ఆదేశించారు.
Delhi on High Alert
High Alert
Government Employees
Holidays Cancelled
India-Pakistan Tension
Drone Attacks
Missile Attacks
National Security
Operation Sindoor
Delhi Airport

More Telugu News