Bhanwarlal Sharma: పాకిస్థాన్ డ్రోన్ దాడి... రాజస్థాన్ ముఖ్యమంత్రి అత్యున్నతస్థాయి సమావేశం

Rajasthan CM Holds High Level Meeting Amidst Pakistan Drone Attack
  • సరిహద్దులో పెరిగిన ఉద్రిక్తతపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ ఉన్నతస్థాయి సమీక్ష
  • సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్ పురా, అర్నియా సెక్టార్లపై పాక్ క్షిపణి దాడులు
  • పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను ధ్వంసం చేసిన భారత గగనతల రక్షణ విభాగం
  • పఠాన్‌కోట్, అమృత్‌సర్ జిల్లాల్లో బ్లాక్‌అవుట్
  • ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచన
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తన నివాసంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, డీజీ ఇంటెలిజెన్స్, ఏడీజీ శాంతిభద్రతలు పాల్గొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు.

పాకిస్థాన్ క్షిపణి దాడులు విఫలం

పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడింది. సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్ పురా, అర్నియా సెక్టార్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఎనిమిది క్షిపణులను ప్రయోగించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అయితే, భారత వాయు రక్షణ విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించి, ఈ క్షిపణులన్నింటినీ గాల్లోనే ధ్వంసం చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.

పంజాబ్‌లో అప్రమత్తత, బ్లాక్‌అవుట్

పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా పంజాబ్‌లోని పఠాన్‌కోట్, అమృత్‌సర్ జిల్లాల్లో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా బ్లాక్‌అవుట్ అమలు చేశారు. పఠాన్‌కోట్‌లో భారీ శబ్దం వినిపించిందని, అది పాకిస్థాన్ షెల్లింగ్ అయి ఉండవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్థానిక యంత్రాంగం భరోసా ఇచ్చింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, విద్యుత్ దీపాలు ఆర్పివేసి, చీకటిని పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సెలవులు రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.
Bhanwarlal Sharma
Pakistan Drone Attack
Rajasthan
India-Pakistan Border Tension
Missile Attacks
Punjab Blackout
Pathankot
Amritsar
Delhi Government
Security Measures

More Telugu News