Revanth Reddy: 'ఆపరేషన్ సిందూర్' వారికి సమాధానం: హైదరాబాద్ ర్యాలీలో రేవంత్ రెడ్డి

Revanth Reddys Powerful Speech at Hyderabad Rally
  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ
  • సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ
  • వీర జవాన్లకు 140 కోట్ల మంది భారతీయులు అండగా ఉంటారన్న సీఎం
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి నగరంలోని యువత పెద్ద ఎత్తున తరలి వచ్చింది. సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత దేశ సార్వభౌమత్వంపై ఎవరైనా దాడి చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. తమ శాంత స్వభావాన్ని చేతకానితనంగా భావించవద్దని హెచ్చరించారు.

భారత భూభాగంలో కాలు మోపి, తమ ఆడబిడ్డల నుదుటి సిందూరాన్ని తుడిచి వేయాలనుకుంటే 'ఆపరేషన్ సిందూర్' ఇందుకు సమాధానం అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ వంటి వాటి ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి భారత వీర జవాన్లకు ఉందని అన్నారు. ఆ వీర జవాన్లకు 140 కోట్ల మంది భారతీయులు అండగా ఉంటారని అన్నారు.

భారత్ వైపు కన్నెత్తి చూస్తే మీకు నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు. బ్రిటిష్ వాళ్ల నుంచి శాంతి ద్వారానే భారత్‌తో పాటు పాక్‌కు కూడా స్వేచ్ఛా వాయువులు అందించి మహాత్మా గాంధీ అమరులయ్యారని, ఆయన చేసిన శాంతియుత పోరాటం వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్నామని అన్నారు.
Revanth Reddy
Hyderabad Rally
Anti-Terrorism Rally
Operation Sindhoor
Telangana

More Telugu News