Pahalgam Terror Attack: దయచేసి భారత్ నుంచి పాకిస్థాన్‌ను కాపాడండి: పాకిస్థాన్ ఎంపీ కన్నీంటి పర్యంతం (ఇదిగో వీడియో)

I am begging you all save Pakistan from India says Pakistani MP
  • భారత్ దాడులతో పాక్ విలవిల... పార్లమెంట్‌లో ఎంపీ ఆవేదన
  • ఆపరేషన్ సిందూర్, పాక్‌లో డ్రోన్ల కలకలంపై ఎంపీ ఆందోళన
  • భారత్ నుంచి మమ్మల్ని కాపాడలంటూ పాకిస్థాన్ ఎంపీ కన్నీరు!
  • మనల్ని నిందితుల్లా చూస్తున్నారని ఆవేదన
పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత్, నేడు పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడింది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, గుజ్రాన్‌వాలా సహా మొత్తం 12 నగరాలపై డ్రోన్లు కలకలం రేపాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఎంపీ ఒకరు వారి పార్లమెంటులో ఒకింత కన్నీటి పర్యంతమయ్యారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్థాన్ పార్లమెంట్‌లో సదరు పార్లమెంట్ సభ్యుడు కన్నీటిపర్యంతమైన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.

సదరు ఎంపీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, "దయచేసి భారత్ నుంచి పాకిస్థాన్‌ను కాపాడండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను" అని రోదిస్తూ అభ్యర్థించారు. "ఇది మా తప్పిదమో, మా లోపమో, లేదా మరేదైనా కారణమో తెలియదు కానీ, ప్రస్తుతం మమ్మల్ని అన్నిచోట్లా నిందితుల్లా పరిగణిస్తున్నారు. మనమందరం దేవుడిని క్షమాపణ కోరాలి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Pahalgam Terror Attack
Pakistan
India

More Telugu News