Uttarakhand Helicopter Crash: ఉత్తరకాశీలో కూలిన హెలికాప్టర్.. గంగోత్రి యాత్రికులు దుర్మరణం
- ఐదుగురు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
- డెహ్రాడూన్ నుంచి హర్సిల్ వెళుతుండగా మార్గమధ్యలో ప్రమాదం
- సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం, దర్యాప్తునకు ఆదేశం
ఉత్తరాఖండ్‌లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళుతున్న ఒక ప్రైవేటు హెలికాప్టర్ ఉత్తరకాశీ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్ సహా మొత్తం ఏడుగురు ఉన్నట్లు సమాచారం.
గంగోత్రి యాత్రికులతో హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి హర్సిల్ హెలిప్యాడ్ కు బయలుదేరింది. అక్కడి నుంచి పర్యాటకులు రోడ్డు మార్గంలో సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగ్నానీకి వెళ్లాల్సి ఉంది. మార్గమధ్యలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద వార్త అందిన వెంటనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) మరియు జిల్లా యంత్రాంగ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ కూడా సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. "ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్రమైన నష్టాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను," అని ఆయన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని, ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం వెల్లడించారు.