Indigo Airlines Bomb Threat: ఇండిగో విమానాన్ని పేల్చివేస్తామంటూ ముంబై ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్

Bomb Threat at Mumbai Airport Indigo Flight Checked
  • చండీగఢ్ నుంచి వస్తున్న విమానంలో బాంబు ఉందని ఫోన్
  • సురక్షితంగా ముంబైలో ల్యాండ్ అయిన ఇండిగో విమానం
  • విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్న బాంబ్ స్క్వాడ్
ముంబై విమానాశ్రయానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఇండిగో విమానాన్ని పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. చండీగఢ్ నుంచి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్టు వారు తెలిపారు. ఈ క్రమంలోనే ఆ విమానం ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అప్పటికే సిద్ధంగా ఉన్న బాంబ్ స్క్వాడ్ విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. విమానంలో ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. 

మరోవైపు పాకిస్థాన్ తో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర భారతంలోని పలు విమానాశ్రయాలను మూసివేయాలని కేంద్రం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్ సర్ విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వాటిని తెరవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
Indigo Airlines Bomb Threat
Mumbai Airport
Bomb Scare
India Pakistan Tension
Chandigarh to Mumbai Flight
Bomb Squad
Airport Security
Northern India Airports Closed
Jammu Airport Closure
Air Travel Security

More Telugu News