Gujarat Titans: ఇంట్రెస్టింగ్ మ్యాచ్... ముంబయి ఇండియన్స్ పై టాస్ గెలిచిన గుజరాత్

Gujarat Titans Win Toss Against Mumbai Indians in IPL Clash
  • ఐపీఎల్ లో నేడు ముంబయి × గుజరాత్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ 
  • ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
ఐపీఎల్ లో ఇవాళ ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ టోర్నీలో  ముంబయి ఇండియన్స్ ప్రస్థానం నిజంగా ఆశ్చర్యకరం. తొలి 5 మ్యాచ్ ల్లో నాలుగు ఓటములు చవిచూసిన ఆ జట్టు... ఆ తర్వాత అనూహ్యరీతిలో పుంజుకుని వరుసగా 6 విజయాలు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్ పై నెగ్గితే ప్లే ఆఫ్ బెర్తు దాదాపుగా ఖాయమైనట్టే. నేటి  మ్యాచ్ లో గుజరాత్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అటు, గుజరాత్ టైటాన్స్ కూడా 10 మ్యాచ్ ల్లో 7 విజయాలు నమోదు చేసి 4వ స్థానంలో ఉంది. దాంతో ఈ మ్యాచ్ గుజరాత్ కు కూడా ముఖ్యమైనదే. 

రబాడా వచ్చేశాడు!

డ్రగ్స్ వాడకం కారణంగా నెల రోజుల పాటు ఐపీఎల్ కు దూరమైన సఫారీ స్టార్ బౌలర్ కగిసో రబాడా నిషేధం ముగించుకుని తిరిగొచ్చాడు. రబాడా గుజరాత్ టైటాన్స్ టీమ్ లోకి వచ్చాడని కెప్టెన్ శుభ్ మన్ గిల్ వెల్లడించాడు. అయితే, రబాడాను నేటి మ్యాచ్ కు ఎంపిక చేయలేదు.
Gujarat Titans
Mumbai Indians
IPL 2023
Cricket Match
Kgaiso Rabada
Shubman Gill
Wankhede Stadium
Mumbai
Gujarat
IPL Playoffs

More Telugu News