Uttar Pradesh: ఓ కుర్రాడు పదో తరగతి పాసైతే ఊరుఊరంతా సంబురపడ్డది.. కారణం ఇదే!

Village Celebrates First 10th Pass in 80 Years
--
ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ జిల్లా నిజాంపూర్ గ్రామంలో ఓ కుర్రాడు పదో తరగతి పరీక్షల్లో పాసయ్యాడు. దీంతో ఆ కుర్రాడి కుటుంబం మాత్రమే కాదు ఊరుఊరంగా సంబురపడ్డది. తమ ఊరికి పేరు తెచ్చాడని ఆ బాలుడిని కొనియాడింది. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పిలిపించుకుని శాలువా కప్పి సత్కరించారు. పైచదువులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ బాలుడు స్టేట్ ర్యాంకు తెచ్చుకున్నాడని అనుకుంటే పొరపాటే.. జస్ట్ పాసయ్యాడంతే. పదో తరగతి పాసైతే ఊరంతా సంబురపడడం కాస్త అతిగా అనిపించవచ్చు కానీ గ్రామస్థుల మాటలు వింటే మాత్రం మన అభిప్రాయం మార్చుకోవాల్సిందే.

ఎందుకంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నిజాంపూర్ గ్రామంలో పదో తరగతి పాసైన్ వారే లేరట. దాదాపు 8 దశాబ్దాల తర్వాత ఇప్పుడు రామ్ కేవల్ పదో తరగతి ఉత్తీర్ణత సాధించడంతో గ్రామస్తులంతా సంతోషిస్తున్నారు. రామ్ కేవల్ ను, అతడి తల్లిదండ్రులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. నిజాంపూర్ లో సుమారు 300 మంది నివసిస్తున్నారు. ఇందులో అధిక శాతం నిరుపేద దళితులే.. పేదరికం కారణంగా చదువుకు దూరమయ్యే వారే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో రామ్ కేవల్ పగటిపూట కూలి పనులకు వెళుతూ రాత్రిపూట కష్టపడి చదివి పదో తరగతి పాసవడంతో అందరూ అతడిని మెచ్చుకుంటున్నారు.
Uttar Pradesh
10th pass
8 decades
Ram Kavel
Nizampur
Barabanki
first graduate
rural education
poverty
India

More Telugu News