నల్లమల అడవుల్లోకి ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు
- ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో పెద్దపులి సంచారం
- మూడు నెలలుగా పెద్దపులి సంచరిస్తూ పశువులను చంపుతోందన్న ఫారెస్టు అధికారి ప్రసాద్ రెడ్డి
- అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని సూచన
ఈ క్రమంలో మార్కాపురం డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ప్రసాద్ రెడ్డి ప్రజలకు కీలక సూచనలు చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని సూచించారు.
అర్ధవీడు మండలంలో గత మూడు నెలలుగా పలు ప్రాంతాలలో పెద్దపులి సంచరిస్తూ పశువులను చంపుతున్నదని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, పెద్దపులి పాదముద్రలను తమ సిబ్బంది సేకరించినట్లు ఆయన వెల్లడించారు.