Sunrisers Hyderabad: హైదరాబాదులో వర్షం... సన్ రైజర్స్ మ్యాచ్ కు అంతరాయం
- ఐపీఎల్ లో సన్ రైజర్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు చేసిన ఢిల్లీ
- వర్షంతో నిలిచిన మ్యాచ్
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు వరుణుడు అడ్డుతగిలాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు చేసింది. అయితే, సన్ రైజర్స్ బ్యాటింగ్ కు దిగాల్సి ఉండగా, వర్షం మొదలైంది. కాసేపట్లోనే భారీ వర్షంగా మారడంతో మైదానాన్ని కవర్లతో కప్పివేశారు.