Tom Bailey: బ్యాటింగ్‌కి వెళ్తూ జేబులో ఫోన్‌.. బ్యాట‌ర్‌ ర‌న్ తీస్తున్న స‌మ‌యంలో కింద‌ప‌డ్డ వైనం.. వైర‌ల్ వీడియో!

Tom Baileys Mobile Phone Incident During County Championship Match Goes Viral
    
ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియ‌న్‌షిప్‌లో ఒక‌ షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న ప్లేయ‌ర్ జేబులోంచి మొబైల్ ఫోన్ కింద‌ప‌డింది. లాంక‌షైర్‌, గ్లూసెష్ట‌ర్‌షైర్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. లాంక‌షైర్ బ్యాట‌ర్ టామ్ బెయిలీ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాడు. బంతిని కొట్టిన అత‌డు మొద‌టి ప‌రుగును పూర్తి చేసి, రెండో ర‌న్ కోసం ప్ర‌య‌త్నించాడు. 

ఆ స‌మ‌యంలో అత‌డి జేబులో నుంచి సెల్‌ఫోన్ కింద‌ప‌డింది. దానిని అత‌డు గుర్తించ‌లేదు. గ్లూసెష్ట‌ర్‌షైర్ బౌల‌ర్ గుర్తించి అంపైర్ల దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట బ్యాట‌ర్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

"ఇదంతా ఇల్లీగ‌ల్‌. అంపైర్లు ఏం చేస్తున్నారు?" అని ఒక‌రు, "అసలు ఫోన్‌ను మైదానంలోకి ఎలా అనుమ‌తిస్తారు. ఇది గ‌ల్లీ క్రికెటా?" అని మ‌రొక‌రు, "ఇది త‌ప్ప‌కుండా శిక్షార్హ‌మే" అని ఇంకొక‌రు కామెంట్ చేశారు. అలాగే ఈ ఘ‌ట‌న‌ను ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్ అలెక్స్ టుడోర్ కూడా త‌ప్పుబ‌ట్టారు. ఈ ఘ‌ట‌న ఇప్పుడు క్రికెట్ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది.  
Tom Bailey
Lancashire
Gloucestershire
County Championship
Cricket
Mobile Phone on Field
Viral Video
England Cricket
Alex Tudor
Illegal in Cricket

More Telugu News