TTD: వేసవి సెలవుల సందర్బంగా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

TTD Announces Easier Srivari Darshan for Summer Vacation
  • సులభతరంగా శ్రీవారి సర్వదర్శనం
  • వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నిరీక్షణకు తెర
  • రేపటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు
వేసవి సెలవుల సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో, తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఊరట కల్పించింది. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనం కల్పిస్తున్నారు. బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం కూడా సామాన్య భక్తులకు కలిసొచ్చింది.

నిన్న ఒక్కరోజే 83,380 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 27,936 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.35 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, రేపటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఉత్సవాల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

TTD
Tirumala
Srivari Darshan
Summer Vacation
Easy Darshan
Vaikuntham Queue Complex
Padmavathi Parinayotsavam
Tirupati
Andhra Pradesh
Religious Tourism

More Telugu News