KKR: కేకేఆర్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ... టాస్ సమాచారం

KKR vs Rajasthan Royals Toss Update and Match Details
  • ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
  • కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో తొలి మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఇవాళ ఆదివారం కావడంతో ఐపీఎల్ లో డబుల్ హెడర్ (రెండు మ్యాచ్ లు) నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు వేదిక. సొంతగడ్డపై టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం మొయిన్ అలీ, రమణ్ దీప్ సింగ్ కోల్ కతా తుది జట్టులోకి వచ్చారు. అటు, రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో మూడు మార్పులు జరిగాయి. హసరంగ తిరిగి జట్టులోకి వచ్చాడు. కునాల్ రాథోడ్, యుధ్ వీర్ లకు తుది జట్టులో స్థానం లభించింది. 

పాయింట్ల పట్టిక చూస్తే... కేకేఆర్ ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించి 7వ స్థానంలో ఉండగా... రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్ ల్లో 3 విజయాలతో 8వ స్థానంలో ఉంది. టోర్నీ నుంచి రాజస్థాన్ జట్టు ఇప్పటికే నిష్క్రమించింది.
KKR
Rajasthan Royals
IPL 2023
Eden Gardens
Kolkata Knight Riders
Moeen Ali
Rahman Deep Singh
Hasaranga
Kunal Rathod
Yudhveer

More Telugu News