Indian Army Information Leak: బార్డర్ లో ఉద్రిక్తతల వేళ భారత ఆర్మీ సమాచారం పాక్ కు లీక్..!

Indian Army Info Leak to Pakistan Amidst Rising Tensions
  • పంజాబ్ లోని అమృత్ సర్ లో ఇద్దరు యువకుల అరెస్ట్
  • పాక్ నిఘా అధికారులకు సమాచారం అందించినట్లు ఒప్పుకున్న నిందితులు
  • ఇద్దరిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్, భారత్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని, ఉగ్రవాదులకు సాయం చేస్తున్న వారిపైనా కఠిన చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఉగ్రవాదుల కట్టడి, పహల్గామ్ నిందితులను నిర్బందించే మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో మోదీ వరుసగా భేటీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆర్మీకి చెందిన సమాచారం పాకిస్థాన్ కు లీక్ అయిందని పంజాబ్ లో వార్తలు వచ్చాయి.

దీంతో అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు అమృత్ సర్ లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పాక్ నిఘా అధికారులకు సమాచారం  చేరవేసినట్లు అంగీకరించారని సమాచారం. అమృత్‌సర్‌లోని కంటోన్మెంట్ ఏరియాతోపాటు ఎయిర్ బేస్‌కు సంబంధించిన పలు చిత్రాలను సైతం వీరు పాకిస్థానీ అధికారులకు అందజేసినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం తెలిపారు. దీంతో నిందితులు పాలక్ షేర్ మాసిహ్, సురజ్ మాహిష్‌ అని వెల్లడించారు. అమృత్‌ సర్ సెంట్రల్ జైల్లో ఉన్న హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టూ, హ్యాపీ సూచనల మేరకు తాము ఈ పనిచేసినట్లు చెప్పారన్నారు. అధికారిక రహస్యాల చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.
Indian Army Information Leak
Pakistan
Amritsar
Punjab Police
Palak Sher Masih
Suraj Mahish
Harpreet Singh
India-Pakistan Tension
Official Secrets Act
Terrorism

More Telugu News