TDP: టీడీపీ మహానాడు నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన నేతలు

TDP Leaders Inspect Mahanadu Venue in Kadapa
  • ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు నిర్వహణ
  • మహానాడు నిర్వహణకు సీకే దిన్నె మండలం చెర్లోపల్లి, పబ్బవరం గ్రామాల పరిధిలోని భూములు ఎంపిక
  • ఈ నెల 7న మహానాడు పనులకు భూమి పూజ
తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు మహానాడును వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడపలో నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు బీద రవిచంద్ర, రాంగోపాల్ రెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, వాస్తు సిద్ధాంతి జయరామిరెడ్డి శనివారం కడపలో పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు.

సీకే దిన్నె మండలం చెర్లోపల్లి, పబ్బవరం గ్రామాల పరిధిలోని భూములను పార్టీ అధిష్టానం అనుమతితో ఈ బృందం ఎంపిక చేసింది. అక్కడ మహానాడు ప్రాంగణం, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌కు స్థలాలను ఎంపిక చేశారు. ఈ స్థలం కడపను తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలతో కలిపేదిగా ఉందని నేతలు చెబుతున్నారు. 

స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి ద్వారా భూముల యజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకున్నారు. ఈ నెల 7న మహానాడు పనులకు భూమి పూజ నిర్వహించి శరవేగంగా పూర్తి చేయాలని నేతలు నిర్ణయించారు. 
TDP
TDP Mahanadu
Kadapa Mahanadu
Andhra Pradesh Politics
Bida Ravichandra
Ranga Gopal Reddy
Damacharla Satya
Telugu Desam Party
YSR District

More Telugu News