APSCHE: ఏపీలో పలు ప్రవేశ పరీక్షల తేదీలు ఇవిగో!

AP Entrance Exam Dates 2025 26 Announced
  • ఉమ్మడి పరీక్షల ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
  • మే 6వ తేదీ నుంచి జూన్ 13 మధ్య ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రవేశ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ కోర్సుల్లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రవేశ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి జూన్ 13 మధ్య ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు:
మే 6న ఈసెట్ (ECET)
మే 7న ఐసెట్ (ICET)
మే 19 మరియు 20న ఏపీ ఈఏపీసెట్ (EAPCET) (వ్యవసాయం, ఫార్మసీ)
మే 21 నుంచి 24 మరియు 26 నుంచి 27 వరకు ఈఏపీసెట్ (EAPCET) (ఇంజినీరింగ్)
జూన్ 5న ఏపీ లాసెట్ (LAWCET), పీజీఎల్‌సెట్ (PGLCET)
జూన్ 6 నుంచి 8 వరకు ఏపీ ఎడ్‌సెట్ (Ed.CET)
జూన్ 9 నుంచి 13 వరకు ఏపీ పీజీసెట్ (PGCET) 
APSCHE
AP EAPCET
AP ICET
AP ECET
AP LAWCET
AP PGCET
AP EdCET
Andhra Pradesh Entrance Exams
Engineering Entrance Exams
Agriculture Entrance Exams

More Telugu News