India: ఈ వైపు కూడా క్లోజ్... పాకిస్థాన్ తో సముద్ర రవాణా మార్గాలు మూసివేసిన భారత్

India Closes Sea Routes with Pakistan
  • పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు
  • పాక్ ను అష్టదిగ్బంధనం చేసేందుకు భారత్ చర్యలు
  • ఇప్పటికే పలు కఠినమైన ఆంక్షలు
  • పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా చర్యలు
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ప్రోద్బలం ఉందని గట్టిగా నమ్ముతున్న భారత్... దాయాది దేశాన్ని అష్టదిగ్బంధనం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. పలు కఠిన ఆంక్షలతో పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భారత కేంద్ర ప్రభుత్వం... తాజాగా సముద్ర రవాణా మార్గాల వైపు దృష్టిసారించింది. పాకిస్థాన్ తో సముద్ర రవాణా మార్గాలను మూసివేసింది. 

మర్చంట్ షిప్పింగ్ యాక్ట్-1958లోని సెక్షన్-411 ప్రకారం కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో, పాకిస్థాన్ జెండా కలిగిన నౌకలు భారత పోర్టుల్లోకి ప్రవేశించడంపై నిషేధం అమల్లోకి వస్తుంది. అంతేకాదు, భారత జెండా కలిగిన నౌకలు కూడా పాకిస్థాన్ పోర్టుల్లోకి వెళ్లడంపై నిషేధం ఉంటుంది. తాజా చర్య ద్వారా పాకిస్థాన్ తో భారత్ అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటున్నట్టు అర్థమవుతోంది. 

ఇప్పటికే పాకిస్థాన్ విమానాలకు భారత్ గగనతలం మూసివేసింది. వాణిజ్యపరమైన అంశాల్లో కూడా నిషేధం ప్రకటించింది. తాజాగా సముద్ర రవాణా మార్గాలను మూసివేస్తూ... పాకిస్థాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
India
Pakistan
Maritime Trade
Sea Routes
Trade Restrictions
Merchant Shipping Act 1958
India-Pakistan Relations
Pulwama Attack
Economic Sanctions
International Relations

More Telugu News