AP Bhavan Delhi Bomb Threat: ఢిల్లీలోని ఏపీ భవన్ కు బాంబు బెదిరింపు

Bomb Threat at AP Bhavan in Delhi
--
ఢిల్లీలోని ఏపీ భవన్ ను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ మేరకు ఒక ఈమెయిల్ వచ్చిందని ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ బెదిరింపులు రావడం, ఆ సమయంలో ఏపీ భవన్ లో సీనియర్ అధికారులు ఉండటంతో అక్కడ టెన్షన్ నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి ఏపీ భవన్ మొత్తం తనిఖీ చేయించారు. భవన్ పరిసరాలను డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసినా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

బెదిరింపు మెయిల్ పంపిన వారిని గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏపీ భవన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఢిల్లీలోని సీనియర్ అధికారుల కోసం ‘‘పూలే’’ సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఏపీ భవన్ లో కలకలం రేగింది. డాగ్ స్క్వాడ్ తనిఖీల తర్వాత బాంబు లేదని తేలడంతో ఏపీ భవన్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
AP Bhavan Delhi Bomb Threat
Delhi AP Bhavan
Bomb Scare
AP Bhavan Security Breach
Bomb Threat Email
India Bomb Threat
Delhi Police
Bomb Squad
Dog Squad

More Telugu News