Rashid Khan: ర‌షీద్ ఖాన్ క‌ళ్లు చెదిరే క్యాచ్‌.. ఈ సీజ‌న్‌లో ఇదే ది బెస్ట్ క్యాచ్ అంటున్న నెటిజ‌న్లు.. వీడియో వైర‌ల్‌

Rashid Khans Stunning Catch Goes Viral
  • నిన్న‌ అహ్మదాబాద్‌లో ఎస్ఆర్‌హెచ్‌, జీటీ మ్యాచ్‌ 
  • 38 ప‌రుగుల‌ తేడాతో గుజ‌రాత్ సూప‌ర్‌ విక్ట‌రీ
  • స్ట‌న్నింగ్ క్యాచ్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తిన ర‌షీద్ ఖాన్‌
  • హెడ్ కొట్టిన అద్భుత‌మైన షాట్‌ను.. అంతే అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ ప‌ట్టిన ర‌షీద్‌
శుక్ర‌వారం అహ్మదాబాద్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌)తో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) సూప‌ర్ విక్ట‌రీని న‌మోదు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ ప్లేయ‌ర్‌ ర‌షీద్ ఖాన్ ప‌ట్టిన ఓ స్ట‌న్నింగ్ క్యాచ్ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. స‌న్‌రైజ‌ర్స్ ఓపెన‌ర్‌ ట్రావిస్ హెడ్ కొట్టిన భారీ షాట్‌కు.. బంతి గాలిలోకి లేచింది. అయితే, ర‌షీద్‌ అద్భుత‌మైన రీతిలో ఆ క్యాచ్‌ను ప‌ట్టుకున్నాడు. 

సుమారు 32 మీట‌ర్ల దూరం ప‌రుగెత్తుకెళ్లి.. చివ‌ర్లో డైవ్ చేసి మ‌రీ క్యాచ్ ప‌ట్టాడు. డీప్ మిడ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తూ ర‌షీద్ ప‌ట్టిన ఆ క్యాచ్ అంద‌ర్నీ స్ట‌న్ చేసింది. దీంతో 16 బంతుల్లో 4 బౌండ‌రీల‌లో 20 ప‌రుగులు చేసిన హెడ్ పెవిలియ‌న్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇదే బెస్ట్ క్యాచ్ అని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక‌, నిన్న‌టి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ 38 పరుగుల తేడాతో చిత్తు చేసిన విష‌యం తెలిసిందే. జీటీ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎస్ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 186/6 స్కోరుకే పరిమితమైంది. హైద‌రాబాద్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్‌శర్మ(41 బంతుల్లో 74) హాఫ్ సెంచరీతో రాణించినా ఫ‌లితం లేకుండాపోయింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు.
Rashid Khan
IPL 2023
Gujarat Titans
Sunrisers Hyderabad
Stunning Catch
Cricket
Travis Head
Viral Video
Best Catch
Ahmedabad

More Telugu News