Canabarro Lucas: ప్ర‌పంచంలోనే అత్యంత వృద్ధ మ‌హిళ క‌న్నుమూత‌

Worlds Oldest Woman Canabarro Lucas Passes Away at 116
  • అత్యంత వృద్ధురాలిగా పేరొందిన క‌న‌బారో లుకాస్ మృతి
  • బ్రెజిల్‌కు చెందిన 116 ఏళ్ల స‌న్యాసిని గురువారం మ‌ర‌ణించినట్లు వెల్ల‌డి
  • 1908 జూన్ 8న బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్‌లో జ‌న్మించిన క‌న‌బారో  
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరొందిన క‌న‌బారో లుకాస్‌ (Canabarro Lucas) కన్నుమూశారు. బ్రెజిల్‌కు చెందిన 116 ఏళ్ల స‌న్యాసిని గురువారం (మే 1న‌) మృతి చెందినట్లు అక్క‌డి అధికారులు వెల్లడించారు. క‌న‌బారో 1908 జూన్ 8న బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్‌లో జ‌న్మించారు. ఆమె 117వ పుట్టిన‌రోజుకు కేవ‌లం నెల రోజుల ముందు క‌న్నుమూశారు. 

వృద్ధాప్య సమస్యల కారణంగా కాసెరోస్‌లోని శాంటా కాసా డి మిసెరికార్డియా ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతూ మృతిచెందిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆమె త‌న జీవితంలో ఎక్కువ భాగం న‌న్‌గానే ఉన్నారు. కాగా, 21వ ఏట  స‌న్యాసినిగా ప్ర‌క‌టించుకున్న క‌న‌బారోకు ఫుట్‌బాల్ ఆట అంటే ఎంతో ఇష్టం. 

అందుకే ఆమె త‌న ప్ర‌తి బ‌ర్త్‌డేకు ఫుట్‌బాల్ టీష‌ర్టును ధ‌రించి పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను సెల‌బ్రేట్ చేసుకునేవార‌ట‌. ఆమె మృతిప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక‌, క‌న‌బారో లుకాస్ మృతితో 115 ఏళ్ల వ‌య‌సు ఉన్న ఈథెల్ కేట‌ర్ ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే అత్యంత వృద్ధ మ‌హిళ‌గా గుర్తింపు పొందారు. ఆమెది ఇంగ్లండ్ దేశం.        
Canabarro Lucas
Oldest Woman
Brazil
116 years old
Nun
Death
Rio Grande do Sul
Ethel Cater
World's Oldest Person
Football

More Telugu News