Anchor Shyamala: చేసిన పెళ్ళికి.. మళ్ళీ పెళ్లి అన్నటుగా ఉంది: యాంకర్ శ్యామల

Anchor Shyamala Slams AP Government
  • అమరావతి శంకుస్థాపన, ఉర్సా భూ కేటాయింపై శ్యామల ఫైర్
  • ఏపీలో స్కీములు లేవు, స్కాములే అంటూ విమర్శలు 
  • ఉర్సా భూ కేటాయింపుపై తీవ్ర ఆరోపణలు
  • రూ.3000 కోట్ల భూమి రూ.99 పైసలకేనా? అంటూ ప్రశ్న
  • దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ నారా లోకేశ్ అంటూ ఆరోపణ
 ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇది "చేసిన పెళ్ళికి.. మళ్ళీ పెళ్లి" అన్నట్లుగా ఉందని ఆమె సెటైర్ వేశారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, అడ్డగోలుగా దోచుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆమె మండిపడ్డారు.

విశాఖపట్నంలో దాదాపు రూ.3,000 కోట్ల విలువ చేసే 60 ఎకరాల ప్రభుత్వ భూమిని, ఊరు పేరు లేని ఉర్సా అనే బినామీ కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున కట్టబెట్టారని శ్యామల ఆరోపించారు. ఈ భూ కేటాయింపు వ్యవహారంలో తెరవెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఉన్నారని, దీనికి కర్త, కర్మ, క్రియ అంతా నారా లోకేశ్ అని ఆమె విమర్శించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, ఈ భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపడం దారుణమని, ఇది ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనమని ఆమె అన్నారు. 

ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా మనసు రాని ప్రభుత్వం, తమకు అనుకూలమైన కంపెనీకి వేల కోట్ల విలువైన భూమిని ఎలా కట్టబెడుతుందని ఆమె ప్రశ్నించారు. ఉర్సా కంపెనీపై ప్రభుత్వానికి ఎందుకింత ప్రేమ? అని శ్యామల నిలదీశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్-6 హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని శ్యామల విమర్శించారు. హామీల అమలును పక్కనపెట్టి, ఇసుక, మద్యం, ఫైబర్ నెట్, మైనింగ్, భూములు, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, దోపిడీకే ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు.
Anchor Shyamala
YSRCP
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Nara Lokesh
Amravati
Land Scam
Visakhapatnam
Telugu Desam Party
AP Government

More Telugu News