Mumbai Indians: వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్‌లో కొన్ని రికార్డులు

Mumbai Indians Win Streak IPL Records Broken
  • ప్రత్యర్థి జట్టు మైదైనంలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన బెంగళూరు
  • సీజన్ మొదటి నాలుగు మ్యాచ్‌లు గెలవడం ఢిల్లీకి ఇదే మొదటిసారి
  • తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా పంజాబ్ రికార్డు
ఐపీఎల్ అంటేనే రికార్డులు, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లకు నెలవు. ప్రతీ సీజన్‌లోనూ కొత్త రికార్డులు నమోదవుతుంటాయి, పాత రికార్డులు బద్దలవుతుంటాయి. ఐపీఎల్-2025 కీలక దశకు చేరుకుంది. 'ప్లే ఆఫ్స్' కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్కో జట్టు సాధించిన ప్రత్యేకమైన రికార్డులను ఒకసారి చూద్దాం...

ప్రత్యర్థి జట్టు మైదానంలో లేదా బయటి వేదికల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఆరు మ్యాచ్‌లలో గెలిచి రికార్డు సృష్టించింది. ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో గెలవడం ఇది ఏడోసారి. ఇలా వరుసగా గెలిచిన సీజన్లలో ముంబై నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలవడం గమనార్హం.

సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ ఆధిపత్యం కనిపించింది. సన్ రైజర్స్‌పై వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచిన గుజరాత్, రాజస్థాన్‌తో ఆడిన ఏడింట ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఢిల్లీ సీజన్ మొదటి నాలుగు మ్యాచ్‌లు గెలవడం ఇది మొదటిసారి. అలాగే సూపర్ ఓవర్లలో ఐదుకు నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత తక్కువ లక్ష్యాన్ని (112) కాపాడుకున్న జట్టుగా పంజాబ్ నిలిచింది. మూడు వేర్వేరు జట్లపై 20కి పైగా విజయాలు నమోదు చేసిన జట్టుగా కోల్‌కతా నిలిచింది. పంజాబ్‌పై 21, బెంగళూరు, సన్ రైజర్స్‌పై 20 చొప్పున విజయాలు నమోదు చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్ రైజర్స్ (287) నిలిచింది. ఈసారి ఆ జట్టు టాప్ స్కోర్ 286. అతిపెద్ద వయస్సులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించిన క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు.
Mumbai Indians
IPL 2025
IPL Records
Royal Challengers Bangalore
Gujarat Titans
Sunrisers Hyderabad
Rajasthan Royals
Delhi Capitals
Punjab Kings
Kolkata Knight Riders
MS Dhoni

More Telugu News