Chandrababu Naidu: సింహాచలం మృతులకు రూ. 25 లక్షల పరిహారం

Simhachalam Temple Wall Collapse Rs 25 Lakh Compensation Announced
  • రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి ఏడుగురు భక్తుల మృతి
  • క్షతగాత్రులకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం
  • ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • మంత్రులు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ. 3 లక్షల చొప్పున అందించనున్నట్టు తెలిపింది. గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిహారం అందజేయాలని ఆదేశించారు. అలాగే, బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించాలని సూచించారు. 

టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు.
Chandrababu Naidu
Simhachalam Temple
Wall Collapse
Andhra Pradesh
Temple Accident
Compensation
Victims
Tragedy
Relief
Ashok Gajapathi Raju

More Telugu News