BSNL: బీఎస్ఎన్ఎల్ నుంచి సూపర్ డూపర్ రీచార్జ్ ప్లాన్

BSNLs Super Duper Recharge Plan
  • కేవలం రూ.1,515 రీచార్జితో ఏడాది పాటు వాలిడిటీ
  • సెకండరీ నంబర్‌గా వాడే వినియోగదారులకు ఎంతో ఉపయోగకరం
  • అపరిమిత కాలింగ్‌తో పాటు ప్రతి రోజు 2జీబీ హైస్పీడ్ డేటా సదుపాయం
  • నెలవారీ ఖర్చు రూ.127లే
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ప్లాన్‌లను అందిస్తోంది. ప్రధానంగా రెండో సిమ్‌గా ఉపయోగించుకునే వారికి తక్కువ ధరతో వార్షిక రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటోంది. కేవలం రూ.127 నెలవారీ ఖర్చుతో ఏడాది పాటు అపరిమిత కాలింగ్, డేటా లభిస్తున్న ఈ అద్భుత ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

గత కొద్ది రోజులుగా ప్రైవేటు టెలికాం సంస్థలు తమ రీఛార్జి ప్లాన్లను పెంచినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్ లక్షలాది మంది కస్టమర్లకు సరసమైన టెలికాం కంపెనీగా మారింది. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌లను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం రెండు అద్భుతమైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.

ఇందులో ఒకటి.. ఏడాదికి (365 రోజులు) ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,515లకు అందిస్తోంది. ఈ ప్లాన్‌లో వినియోగదారుడు ప్రతి రోజు 2 జీబీ హై స్పీడ్ డేటాను పొందడంతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం, రోజుకు వంద ఎస్ఎంఎస్‌‌లను పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లేదు. కానీ ఈ ప్లాన్ వల్ల నెలవారీ ఖర్చు కేవలం రూ.126.25 మాత్రమే అవుతుంది.

మరో ప్లాన్ విషయానికి వస్తే 336 రోజుల కాలానికి రూ.1,499 రీఛార్జి ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో 24 జీబీ డేటా మాత్రమే అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా ఉంది. ఈ ప్లాన్‌తో నెల వారీ ఖర్చు రూ.137లు మాత్రమే అవుతుంది. 
BSNL
BSNL recharge plans
annual BSNL plan
unlimited calling
high-speed data
budget-friendly recharge
BSNL prepaid plans
telecom plans

More Telugu News