Ataullah Tarar: మరో 36 గంటల్లో పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్య.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

India to Take Military Action Against Pakistan in 36 Hours Pak Minister
  • కీలక వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రి అతవుల్లా తరార్
  • నిఘా వర్గాల నుంచి తమకు పక్కా సమాచారం ఉందన్న మంత్రి
  • ప్రతి చర్య తీవ్రంగా ఉంటుందని భారత్‌కు హెచ్చరిక
పహల్గామ్ దాడి అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ సమాచారశాఖ మంత్రి అతవుల్లా తరార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో తమపై సైనిక చర్యకు భారత్ సిద్ధమవుతోందని పేర్కొన్నారు. వచ్చే 24-36 గంటల్లో భారతదేశం తమపై సైనిక చర్య చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయమై నిఘా వర్గాల నుంచి తమకు కచ్చితమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. మోదీ నిన్న తన నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

పహల్గామ్ ఉగ్రదాడిపై ఇటీవల అక్కసు వెళ్లగక్కిన అతవుల్లా తరార్.. తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని మొసలి కన్నీరు కార్చారు. పహల్గామ్ దాడిపై తటస్థ, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని ప్రకటించారు. అయినప్పటికీ భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతోందని ఆరోపించారు. అయితే, భారత్ చర్యకు ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
Ataullah Tarar
India-Pakistan tensions
Pakistan
India
Military action
Pulwama attack
Surgical strike
Terrorism
Modi
National Security

More Telugu News