Jackie Chan: జాకీ చాన్‌కు విశిష్ట పురస్కారం

Jackie Chan to Receive Lifetime Achievement Award
  • 78వ లోకర్నో ఫిలిమ్ ఫెస్టివల్ జీవన సాఫల్య పురస్కారంకు ఎంపికైన జాకీ చాన్
  • ఆగస్టు 6 నుంచి 16వ వరకు 78వ లోకర్నో ఫిలిమ్ ఫెస్టివల్ 
  • గత ఏడాది ఫిలిమ్ ఫెస్టివల్‌లో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న షారూఖ్ ఖాన్
ప్రముఖ యాక్షన్ స్టార్ జాకీ చాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన అనేక యాక్షన్ చిత్రాలు ఆసియాలోనే కాదు, హాలీవుడ్‌లోనూ వసూళ్ల వర్షం కురిపించాయి. ప్రపంచ వ్యాప్తంగా జాకీ చాన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

అలాంటి జాకీ చాన్ ఆగస్టు 9న 78వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ ఆగస్టు 6న ప్రారంభమై 16వ తేదీ వరకు జరగనుండగా, జాకీ చాన్‌ను లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు.

ఈ సందర్భంగా ఫెస్టివల్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ జియోన ఎ నజ్జరో మాట్లాడుతూ.. యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, యాక్షన్ కొరియోగ్రాఫర్, సింగర్, డేర్ డేవిల్ స్టంట్ మేన్, అథ్లెట్ ఇలా జాకీ చాన్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు వెలుగుచూస్తాయని, అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలిని గౌరవించడం లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌కే ఓ కళ అని పేర్కొన్నారు.

గత ఏడాది 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా షారూఖ్ ఖాన్‌ను ఇదే పురస్కారంతో సత్కరించారు. ఈసారి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకుంటున్న జాకీ చాన్ వయస్సు ఇప్పుడు 71 సంవత్సరాలు. గతంలో మాదిరిగా స్టంట్స్ చేయకపోయినా ఇప్పటికీ తన మార్క్ ప్రదర్శిస్తూ మూవీల్లో పాత్రలు పోషించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. 
Jackie Chan
Locarno Film Festival
Lifetime Achievement Award
Action Star
Hollywood
Asian Cinema
78th Locarno Film Festival
Shahrukh Khan
Award Ceremony

More Telugu News