Chandrababu Naidu: సింహాచలం దుర్ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Chandrababu Naidu expresses grief over Simhachalam temple tragedy
        
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగానే గోడ కూలిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సింహాచలంలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్టు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. 
Chandrababu Naidu
Simhachalam temple incident
Wall collapse
Andhra Pradesh
Temple festival
Tragedy
Varaha Lakshminarasimha Swamy
Chandanotsavam
Accidents
Relief measures

More Telugu News