Leopard in Police Station: పోలీస్ స్టేషన్ లోకి చిరుత.. గదిలో చక్కర్లు.. వీడియో ఇదిగో!

Leopard Enters Tamil Nadu Police Station
––
తమిళనాడు రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్ లోకి చిరుతపులి ప్రవేశించింది. రాత్రిపూట ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చి గదిలో కలియతిరిగింది. లోపల ఎవరూ కనిపించకపోవడంతో కాసేపటి తర్వాత తిరిగి వెళ్లిపోయింది. ఊటీ సమీపంలోని నడువట్టం పోలీస్ స్టేషన్ లో సోమవారం (ఈ నెల 28) రాత్రి 8:30 గంటల సమయంలో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది.

నీలగిరి జిల్లాలోని నడువట్టం పోలీస్ స్టేషన్ లో చిరుత సంచరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుతను గమనించిన ఓ కానిస్టేబుల్ భయాందోళనకు గురయ్యాడు. కాసేపటికి చిరుత వెళ్లిపోవడంతో వెంటనే తలుపులు మూసివేయడం వీడియోలో కనిపించింది. కాగా, నడువట్టం ప్రాంతంలో చిరుతల సంచారం ఇటీవల ఎక్కువైందని, అటవీ శాఖ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Leopard in Police Station
Tamil Nadu
Naduvattam Police Station
Nilgiris District
Viral Video
Wildlife
Leopard Sighting
India
Police Station Incident
Udhagamandalam

More Telugu News