Shubman Gill: గిల్ ధనాధన్ ఇన్నింగ్స్... బట్లర్ దూకుడు... గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు

Gujarat Titans Gill and Buttler Power to Massive Score Against Rajasthan Royals
  • జైపూర్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగులు చేసిన గుజరాత్
  • గిల్ 84, బట్లర్ 50 నాటౌట్
రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. జైపూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగులు చేసింది. 

కెప్టెన్ శుభ్ మన్ గిల్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా, జోస్ బట్లర్ మెరుపులు మెరిపించాడు. గిల్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 84 పరుగులు చేయగా... బట్లర్ 26 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

అంతకుముందు, ఓపెనర్ సాయి సుదర్శన్ 39 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్, గిల్ ఓపెనింగ్ జోడీ తొలి వికెట్ కు 93 పరుగులు జోడించడం విశేషం. రాజస్థాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ 2, జోఫ్రా ఆర్చర్ 1, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.
Shubman Gill
Gujarat Titans
Jos Buttler
Rajasthan Royals
IPL 2023
Cricket Match
Jaipur
T20 Cricket
Gujarat Titans Score
IPL Highlights

More Telugu News