Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ పోరు... టాస్ సమాచారం

Rajasthan Royals vs Gujarat Titans Toss Update and Match Preview
 
ఐపీఎల్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఢీకొంటున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదిక.

ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ జట్టులో రెండు మార్పులు చేశారు. ఫజల్ హక్ ఫరూఖీ స్థానంలో మహీశ్ తీక్షణ... తుషార్ దేశ్ పాండే స్థానంలో యుధ్ వీర్ జట్టులోకి వచ్చారు. అటు, గుజరాత్ టైటాన్స్ టీమ్ లో ఒక మార్పు చేశారు. కరీమ్ జన్నత్ తుది జట్టులో  స్థానం సంపాదించుకున్నాడు. ఈ ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. 

ఇక, పాయింట్ల విషయానికి వస్తే... గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్ ల్లో 6 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా... రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఏమీ బాగా లేదు. రాజస్థాన్ ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించి 9వ స్థానంలో నిలిచింది.
Rajasthan Royals
Gujarat Titans
IPL 2023
Cricket Match
IPL Points Table
Mahesh Teekshana
Yudhvir
Karim Janat
T20 Cricket
Rajasthan Royals vs Gujarat Titans

More Telugu News