K. Ramakrishna Rao: రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ తదుపరి సీఎస్ రామకృష్ణారావు

Telanganas Next Chief Secretary Meets CM Revanth Reddy
  • తెలంగాణ నూతన సీఎస్ గా కె. రామకృష్ణారావు
  • సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రామకృష్ణారావు
  • ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ శాంతికుమారి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణారావు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం కె. రామకృష్ణారావును నూతన సీఎస్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం కె. రామకృష్ణారావు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ జాబితా ప్రకారం ఆయనతో పాటు మరో ఆరుగురు అధికారులు వ్రధాన కార్యదర్శి పదవి రేసులో ఉండగా, ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి కె. రామకృష్ణారావును నియమించాలని నిర్ణయించింది. ఆయన 2014 సంవత్సరం నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
K. Ramakrishna Rao
Telangana Chief Secretary
Revanth Reddy
Telangana Government
New Chief Secretary
Shanti Kumari
Finance Department
Telangana Politics
Government Appointments

More Telugu News