Indian Navy: పాక్ కు వణుకు పుట్టించేలా అరేబియా సముద్రంలో భారత్ క్షిపణి పరీక్ష

Indias Missile Test in Arabian Sea Sends Shivers Down Pakistans Spine
--
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా భారత నౌకాదళం ఆదివారం అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షలు నిర్వహించింది. నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు భారత నౌకాదళం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. యుద్ధ సన్నద్ధతను పరీక్షించడంలో భాగంగా ఈ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది. సముద్ర జలాల్లో భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్‌ నేవీ ఎల్లప్పుడూ సిద్ధమని ప్రకటించింది. 

ఇదిలా ఉండగా, మూడు రోజుల క్రితం అరేబియా సముద్రంలోనే నేవీ అధికారులు సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించారు. మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ తో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైందని వెల్లడించారు. ఈ పరీక్షకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు పేర్కొంది.
Indian Navy
Missile Test
Arabian Sea
Pakistan
Defense
Military Exercise
Surface-to-Air Missile
National Security
India-Pakistan Relations

More Telugu News