Asim Munir: భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్

Pakistan Army Chief Asim Munirs Anti India Remarks
  • దాయాది దేశంపై చర్యలకు ఉపక్రమించిన భారత్
  • భారత్‌పై విషం చిమ్ముతున్న పాక్ నేతలు
  • మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ దాయాది దేశంపై చర్యలకు ఉపక్రమించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాక్ నేతలు భారత్‌పై విషం చిమ్ముతూనే ఉన్నారు. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు.

రెండు దేశాల మధ్య సిద్ధాంత ప్రస్తావనను తీసుకువస్తూ.. అన్ని అంశాల్లో హిందూ, ముస్లింలు వేర్వేరని వ్యాఖ్యానించారు. మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షల్లో హిందూ, ముస్లింలు వేర్వేరని పేర్కొన్న అసిం మునీర్.. వాటి ఆధారంగానే రెండు దేశాలు ఉండాలనే భావన ఏర్పడిందన్నారు.

పాకిస్థాన్ ఏర్పాటుకు పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారని, వాటిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్థాన్ మిలటరీ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్‌లో అసిం మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకు ముందు ప్రవాస పాకిస్థానీల తొలి సదస్సులో కూడా మునీర్ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. మనది ఒక దేశం కాదని, రెండు దేశాలు అని అన్నారు. కశ్మీర్ తమ జీవనాడి లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా ఆయన వ్యాఖ్యానించిన కొన్ని రోజుల్లోనే పహల్గామ్‌లో ఉగ్రదాడి జరగడం గమనార్హం. 
Asim Munir
Pakistan Army Chief
India-Pakistan Relations
Hindu-Muslim Divide
Kashmir Conflict
Pulwama Attack
Terrorism
Pakistan
India
South Asia

More Telugu News