Priyadarshi: 'కోర్ట్' మూవీలో ప్రియ‌ద‌ర్శి న‌ట‌న‌కు ఫిదా.. స్పెష‌ల్ గిఫ్ట్ పంపిన కోలీవుడ్ స్టార్ క‌పుల్

Priyadarshis Performance in Court Movie Impresses Surya  Jyotika
  • చిన్న చిత్రంగా విడుద‌లై... సూప‌ర్ హిట్‌గా నిలిచిన ‘కోర్ట్‌’ మూవీ 
  • సినిమాలో జూనియర్ లాయర్ పాత్ర‌లో న‌టించి మెప్పించిన ప్రియదర్శి 
  • ఆయ‌న పాత్ర‌కు ఫిదా అయిన స్టార్ క‌పుల్‌ సూర్య‌, జ్యోతిక‌ 
  • ప్రియ‌ద‌ర్శిని ప్ర‌శంసిస్తూ ప్ర‌త్యేక బ‌హుమానం పంపిన వైనం
  • వారి నుంచి స్పెష‌ల్ గిఫ్ట్ రావ‌డంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న న‌టుడు
ఇటీవ‌ల చిన్న చిత్రంగా విడుద‌లై... సూప‌ర్ హిట్‌గా నిలిచిన మూవీ ‘కోర్ట్‌’. ప్రియ‌ద‌ర్శి, శ్రీదేవి, హ‌ర్ష్ రోష‌న్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. నాని నిర్మాతగా రామ్ జగదీశ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మార్చి 14న రిలీజైన మూవీకి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో వ‌సూళ్లు కూడా కుమ్మేసింది. అలాగే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందింది. 

ప్ర‌స్తుతం ‘కోర్ట్’  చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తాజాగా ఈ సినిమా చూసిన త‌మిళ స్టార్ క‌పుల్‌ సూర్య, జ్యోతికకు మూవీ బాగా న‌చ్చింది. అందులోనూ న్యాయ‌వాది పాత్ర‌లో క‌నిపించిన‌ న‌టుడు ప్రియ‌ద‌ర్శి న‌ట‌న‌కు వారు ఫిదా అయ్యారు. దాంతో ప్రియ‌ద‌ర్శిని అభినందిస్తూ స్పెష‌ల్ గిఫ్ట్‌ పంపారు. ఈ విష‌యాన్ని న‌టుడు ప్రియ‌ద‌ర్శి ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. వారు పంపిన బ‌హుమ‌తి త‌న హృద‌యాన్ని ఆనందంతో నింపేసిందని ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నారు. కాగా, సినిమాలో ప్రియదర్శి జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో నటించిన విష‌యం తెలిసిందే.

"సూర్య అన్న, జ్యోతిక మేడ‌మ్‌కి 'కోర్ట్' మూవీ న‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు పంపిన సందేశం, పువ్వులు నా హృదయాన్ని మాటల్లో చెప్పలేనంతగా నింపేశాయి. ఈ ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేను. నన్ను ఎంతగానో ప్రేరేపించిన న్యాయవాదులు చంద్రు (జై భీమ్ సినిమాలో సూర్య పాత్ర పేరు), వెంబా(పొన్‌మ‌గ‌ల్ వందాల్ సినిమాలో జ్యోతిక పాత్ర‌) వెన్నుతట్టి ప్రోత్సహించినట్లు అనిపించింది" అని ప్రియ‌ద‌ర్శి ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. 
Priyadarshi
Court Movie
Surya
Jyotika
Kollywood
Tollywood
Special Gift
Netflix
Telugu Cinema
Ram Jagadish

More Telugu News